నేనే గొప్ప లీడర్‌..ప్రగతి భవన్‌‎లో కేఏ పాల్ హల్ చల్

Update: 2023-07-03 10:45 GMT

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌‎కు చేదు అనభవం ఎదురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు పాల్ సోమవారం ప్రగతి భవన్‌‎కు వచ్చారు. సీఎంను కలవాలంటూ ప్రగతి భవన్‎లో హల్ చల్ చేశారు. అయితే అపాయింట్మెంట్ లేదంటూ కేఏ పాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు.పాల్‎ను లోపలికి అనుమతించలేదు. దాంతో కేఏ పాల్‌ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వారితో వాగ్వాదానికి దిగారు. సీఎం ప్రగతి భవన్‎లో ఉన్నా కూడా తనను ఎందుకు లోపలికి పంపించడం లేదని పోలీసులను ప్రశ్నించారు.

అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రివాల్‎కు అపాయింట్మెంట్ ఇస్తున్న కేసీఆర్ తనకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ కంటే తానే గొప్ప లీడర్ అని, తనకు అనుమతి ఇవ్వాలని పోలీసులపై ఫైర్ అయ్యారు. అక్టోబర్ 2న నిర్వహించే ప్రపంచ శాంతి మహా సభలకు సీఎంను ఆహ్వానించేందుకే ఇక్కడకు వచ్చానని పాల్ తెలిపారు. అయినప్పటికీ పోలీసులు కేఏ పాల్‏ను ప్రగతి భవన్‎లోకి అనుమతించలేదు. గేటు దగ్గరి నుంచే పంపించేశారు.

Tags:    

Similar News