రెండు రోజుల్లో సింబల్ ఇవ్వకపోతే.. ప్రజలు ఓట్లు వేయొద్దు : పాల్

By :  Krishna
Update: 2023-11-10 15:18 GMT

దేశంలో ప్రజాస్వామ్యం బతికుందా అని అనిపిస్తోందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. తమ పార్టీకి ఇప్పటివరకు సింబల్ కేటాయించలేదని.. దీంట్లో అధికార పార్టీ కుట్ర ఉందని ఆరోపించారు. ఎన్నికల అధికారులు ఈసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్గా ఉన్నా.. గుర్తు కేటాయించకపోవడం దారుణమన్నారు. తాము హెలికాఫ్టర్ లేదా రింగ్ గుర్తు ఇవ్వాలని అడిగామని.. కానీ ఈసీ ఇంతవరకు స్పందించలేదని చెప్పారు.

పాల్ రావాలి.. పాలన మారాలని ప్రజలు కోరుకుంటున్నారని కేఏ పాల్ అన్నారు. రెండు రోజుల్లో తమ పార్టీకి సింబల్ కేటాయించకపోతే ప్రజలు ఓట్లు వేయొద్దన్నారు. ఒకవేళ వేయాలనుకుంటే నోటాకు వేయాలని సూచించారు. చట్టాలు మార్చకపోతే భారత్ కూడా పాకిస్తాన్, సూడాన్లా మారిపోతుందని పాల్ అన్నారు. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచినా మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని అన్నారు. పవన్ కళ్యాణ్ వంటి ప్యాకేజీ స్టార్స్ను నమ్మొద్దని సూచించారు.


Tags:    

Similar News