ప్రజాకవి కాళోజీ కుమారుడు కాళోజీ రవికుమార్(70) అనారోగ్యంతో మరణించారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న రవికుమార్ ఇవాళ ఉదయం తుదివిశ్వాస విడిచినట్లు కాళోజీ ఫౌండేషన్ తెలిపింది. ఆయన పార్థివదేహాన్ని స్వస్థలం హన్మకొండ జిల్లా నక్కలగుట్టకు తరలించారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.కాళోజీకి రవికుమార్ ఏకైక సంతానం. ఆయన కాళోజీ ఫౌండేషన్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన మరణం పట్ల కాళోజీ ఫౌండేషన్, మిత్రమండలి సభ్యులు సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.