మరో మూడు రోజుల పాటు కవిత కస్టడీలోనే

By :  Vinitha
Update: 2024-03-23 08:50 GMT

ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఏడు రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మూడు రోజుల పాటు పొడిగించింది. అంతకుముందు విచారణలో కవిత ఈడీకి సహకరించడం లేదని ఆరోపించింది. సమీర్ మహీంద్రతో కలిపి కవితను విచారించాలని అడిగింది. లిక్కర్ స్కాంలో రూ. కోట్లలో కిక్ బ్యాక్ లు అందాయని ఈడీ తెలిపింది.

సౌత్ గ్రూప్కు రూ.100 కోట్లు చేరాయ‌ని ఆరోపించింది. క‌విత ఫోన్ డేటాను తొలిగించిన‌ట్లు త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని కోర్టుకు తెలియజేసింది. అలాగే ఆమె కుటుంబ సభ్యుల వివరాలను ఇవ్వడం లేదని ఈడీ న్యాయస్థానానికి వివరించింది. అలాగే కవిత మేనల్లుగి వ్యాపారానికి సంబంధించిన వివరాలను అడిగినట్లు తెలిపింది. ప్రస్తుతం కవిత మేనల్లుడి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని తెలిపింది. క‌విత‌ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన విషయాలపై ఫోరెన్సిక్ సైన్స్ నివేదిక‌తో విచారిస్తున్నామ‌ని చెప్పారు. సోదాల్లో మేన‌ల్లుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న‌ట్లు వివరించింది. మ‌రోవైపు ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని..కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని కవిత ఆరోపించారు. 

Tags:    

Similar News