MLC Kavita : ఇవాళ్టి విచారణకు కవిత హాజరుకారు.. ఈడీకి లాయర్ల లేఖ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇవాళ జరిగే ఈడీ విచారణకు హాజరు కావడంలేదు. ఈ విషయాన్ని ఆమె తరుపున లాయర్లు ఈడీకి లేఖ రాసినట్లు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పాత్రపై విచారించేందుకు గతంలో పలుమార్లు కవితకు ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వేరే అవకాశాలు ఉన్నా.. ఒక మహిళను విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లో ఉంది.
అయితే జనవరి 5న మరోసారి కవితకు ఈడీ నోటీసులు పంపి.. జనవరి 17న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఒక పక్క సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా మళ్లీ నోటీసులు ఇవ్వడం సరికాదని, విచారణకు కవిత హాజరు కారని ఆమె తరపు న్యాయవాదులు ఈడీకి లేఖ రాశారు. గతేడాది మార్చిలో కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే.