Semiconductor Industry: తెలంగాణలో సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ

Update: 2023-10-06 07:32 GMT

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కేయిన్స్ టెక్నాలజీ సంస్థ ముందుకు వచ్చింది. రూ.2800 కోట్ల పెట్టుబడితో ఓసాట్, కాంపౌండ్ సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేయిన్స్ టెక్నాలజీ సంస్థ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కేయిన్స్ టెక్నాలజీ సంస్థ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో రెండు వేల మంది యువతకు ఉపాధి లభించనుందని కంపెనీ తెలిపింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టాలనుకున్న కేయిన్స్ కంపెనీ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.

రూ. 2,800 కోట్ల పెట్టుబ‌డితో ఓసాట్, కాంపౌండ్ సెమీ కండక్ట‌ర్ త‌యారీ కేంద్రం ఏర్పాటు చేయ‌నుంది కేయిన్స్ టెక్నాల‌జీ సంస్థ‌. ఈ ప‌రిశ్ర‌మ ద్వారా 2 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. సెమీ కండ‌క్ట‌ర్ ప‌రిశ్ర‌మ‌కు ఆతిథ్యం ఇచ్చే ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌పంచ గ‌మ్య‌స్థానాల లీగ్‌లో తెలంగాణ చేరినందుకు గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. ఎల‌క్ట్రానిక్స్ రంగంలో ఫ్యాక్స్ కాన్, కార్నింగ్ వంటి ప్ర‌పంచ స్థాయి కంపెనీలు తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News