VijayShanti : KCR, BRS అంటే ఫుల్ఫామ్ చెప్పిన విజయశాంతి.. ట్వీట్ వైరల్
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు దశల వారీగా హామీల అమలు చేస్తుండగానే.. 30 రోజులు కాకముందే 420 అంటూ విమర్శిస్తూ పుస్తకం ప్రచురించడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ట్వీట్ చేసిన విజయశాంతి..
‘‘భవిష్యత్ రహిత సమితి (BRS) నాయకత్వం అధికారం లేకుంటే అసలు బతకలేని స్థితికి చేరుకున్నట్లు కనబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు ఒక వైపు దశలవారీగా చేస్తుండగానే, 30 రోజులు కాకముందే 420 అంటూ విమర్శిస్తూ పుస్తకం ప్రచురించారు బీఆర్ఎస్ వైపు నుండి. అదికూడా దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ నెత్తిన 6 లక్షల కోట్లు అప్పు పెట్టిన అంశం వారే సిగ్గులేక యాదిమరిచి.. నిజానికి గత సుమారు 10 ఏండ్ల బీఆర్ఎస్ మోసపు, అసత్యపు, అమలు చేయని హామీలు, అవినీతి, అరాచకాల గురించి, #K_కోతి_C_చేష్టల_R_రాజ్యం (#కేసిఆర్) పరిపాలన గురించి పుస్తకాలు ప్రచురిస్తే అది ఒక గ్రంథాలయానికి చాలచ్చు బహుశా’’ అని ట్వీట్ చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ముందు విజయశాంతి బీజీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
#భవిష్యత్_రహిత_సమితి (#BRS) నాయకత్వం అధికారం లేకుంటే అసలు బతకలేని స్థితికి చేరుకున్నట్లు కనబడుతోంది.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) January 4, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు ఒక వైపు దశలవారీగా చేస్తుండగానే, 30 రోజులు కాకముందే 420 అంటూ విమర్శిస్తూ పుస్తకం ప్రచురించారు బీఆర్ఎస్ వైపు నుండి.అదికూడా దుర్మార్గ బీఆర్ఎస్… pic.twitter.com/WOi15jpvkA