రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నానంటే... కేసీఆర్ క్లారిటీ
సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి అసెంబ్లీకి పోటీచేస్తారని వచ్చిన ఊహాగానాలు నిజమయ్యాయి. అయితే కామారెడ్డితోపాటు తన సిట్టింగ్ స్థానం గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గజ్వేల్ నుంచి తాను పోటీ చేస్తానని బీజేపీ నేత ఈటల్ రాజేందర్ చెబుతుండడంతో సీఎం ఢీఢీ అంటే ఢీ అని డబుల్ బరిలోకి దిగారు. రెండు సీట్ల నుంచి పోటీ చేయడానికి కారణమేంటని మీడియా ప్రతినిధులు అడగ్గా, పార్టీ నిర్ణయం అని చెప్పారు. ‘‘ఇందులో విశేషం ఏమీ లేదు. కేసీఆర్ చరిత్ర మీకు తెల్వదు. కరీంనగర్, రివర్స్‌ల మహబూబ్ నగర్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచా. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని అక్కడి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వ్యక్తిగతంగా కలిసి మరీ కోరారు. నిజామాబాద్ మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు నన్ను కలసి పోటీ చేయమని అడిగారు. సహా కొన్ని జిల్లాల నేతలు కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని అడిగారు. అన్ని విషయాలు చర్చించుకుని కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పారు.