ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ కాంగ్రెస్ - కేసీఆర్

Update: 2023-11-17 11:34 GMT

తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఎంతో మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ఆ పార్టీ బీఆర్ఎస్ ను చీల్చే ప్రయత్నం చేసిందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. స్వాతంత్ర్యం వచ్చి 75ఏండ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని కేసీఆర్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని కేసీఆర్ అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రైతు బంధు మొత్తాన్ని విడతలవారీగా రూ.16వేలకు పెంచుతామని చెప్పారు. 24 గంటల కరెంటు అవసరం లేదని పీసీసీ చీఫ్ అంటున్నారని, వాళ్లు చెప్పినట్లు 3 గంటల విద్యుత్ తో పొలం పారుతుందా అని ప్రశ్నించారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు అన్న కేసీఆర్.. అభ్యర్థి వెనుకున్న పార్టీ విధివిధానాలు గమనించాలని సూచించారు.




Tags:    

Similar News