తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థతిని వైద్యనిపుణుల బృందం నిత్యం పర్యవేక్షిస్తోంది. ఆయన ఈరోజే తుంటి ఎముక మార్పడి ఆపరేషన్ నిర్వహించనున్నారు. కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఈ విషయం వెల్లడించారు. కేసీఆర్ కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ కృతజ్ఞతలని ట్వీట్ చేశారు. దానికి కేసీఆర్ ఆరోగ్యంపై యశోదా ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ను జతచేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు కూడా కేసీఆర్ ఆరోగ్య వివరాలను మీడియాకు తెలిపారు. మాజీ సీఎంకు హిమ్ రీప్లేస్మెంట్ సర్జరీ జరుగుతుందన్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన పడొద్దని కోరారు. కేసీఆర్ గురువారం రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో అర్ధరాత్రి బాత్రూంకు వెళ్లి జారిపడడంతో తుంటి ఎముక విరిగింది.