అంగన్‌వాడీ సిబ్బిందికి గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కారు

By :  Kiran
Update: 2023-09-12 17:16 GMT

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మినీ సెంటర్లను అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌డ్రేట్‌ చేసింది. దీంతో పాటు రిటైర్మెంట్ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ జీవో జారీ చేసింది. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.లక్ష, హెల్పర్లకు రూ.50వేలు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రిటైర్మెంట్ తర్వాత ఆసరా పెన్షన్‌ మంజూరు చేయనున్నట్లు జీవోలో స్పష్టం చేసింది. సర్వీసులో ఉన్న సమయంలో అంగన్‌వాడీలు టీచర్లకు ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 20 వేలు, హెల్పర్లకు రూ.10వేలు అందజేయనుంది. అంగన్ వాడీల విషయంలో తీసుకున్న నిర్ణయానికి మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు.

అంగన్‌వాడీలపై ఒత్తిడి తగ్గించేందుకు యాప్‌ సింప్లిఫై చేయనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్న మంత్రి.. అంగన్‌వాడీలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

Tags:    

Similar News