ఉద్యోగులు మాత్రమే విలీనం.. గవర్నర్కు ప్రభుత్వం వివరణ..

Update: 2023-08-05 09:25 GMT

తెలంగాణలో ఆర్టీసీ బిల్లుపై సీఎం వర్సెస్ గవర్నర్గా పరిస్థితి మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకుని.. ఆ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపించారు. అయితే ఆ బిల్లుపై గవర్నర్ పలు సందేహాలను వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ వివరణను కోరారు. ఈ క్రమంలో గవర్నర్కు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని.. ఆర్టీసీ కార్పొరేషన్ అలాగే ఉంటుందని ప్రభుత్వం గవర్నర్కు తెలిపింది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని చెప్పింది. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. జీతాలు, కేడర్‌, ప్రమోషన్లకు ఎలాంటి సమస్య ఉండదని వివరించింది.

కార్పొరేషన్ యథాతథంగా ఉండడంతో విభజన చట్టానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం తెలిపింది. అలాగే కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని చెప్పింది. పింఛన్లకు సంబంధించి ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్‌ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం వివరించింది. వివరణ ఇచ్చిన నేపథ్యంలో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరింది. ప్రభుత్వం వివరణపై గవర్నర్ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

Tags:    

Similar News