వీడిన ఉత్కంఠ.. నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ ఆమెకే..!

By :  Krishna
Update: 2023-10-25 11:00 GMT

నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి అంశంపై ఉత్కంఠ వీడింది. నర్సాపూర్ టికెట్ను మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా రెడ్డికే కేటాయించారు గులాబీ బాస్. ఆమెకు బీఫాం సైతం అందజేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని.. సునీతారెడ్డికి టికెట్ ఇచ్చారు. మదన్ రెడ్డికి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంపి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ మదన్ రెడ్డిని ఒప్పించారు.

2014, 2018లో మదన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సునీతారెడ్డిపై గెలిపొందారు. 2018 ఎన్నికల తర్వాత సునీతారెడ్డి కాంగ్రెస్లో చేరారు. 2023లో టికెట్ ఇస్తారనే హామీ తర్వాతే ఆమె బీఆర్ఎస్ కండువా కప్పుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీలో చేరిన కొన్నాళ్లకే ఆమెకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని ఇచ్చారు. అయితే సునీతారెడ్డి టికెట్ ఇవ్వొద్దంటూ మదన్ రెడ్డి అనుచరులు మంత్రి హరీష్ రావు ఎదుట ఆందోళనలు సైతం చేపట్టారు. అయినా అధిష్టానం మాత్రం ఆమెవైపే మొగ్గు చూపింది. కాగా సునీతారెడ్డి వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. 2014 కంటే ముందు మూడు పర్యాయాలు ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News