అందులో గవర్నర్ తప్పేముంది.. మీరూ ఆలోచించాలి

Update: 2023-08-05 11:21 GMT

thumb: అదే కేసీఆర్ మాస్టర్ ప్లాన్

రాష్ట్రంలో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇంకా అందలేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. పంట నష్టంపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కల్వల ప్రాజెక్ట్ ను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నష్టపరిహారంగా ఇస్తామన్న రూ.10వేలు ఇవ్వకుండా.. రైతులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. పాత పథకాలను ఆపి, కొత్త పథకాలను తేవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్థులను అమ్మేందుకే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం భరించాలని అన్నారు.

ఆర్టీసీ విలీనం చేయాలని కేసీఆర్ నాలుగేళ్లు ఆలోచించారు. ఇప్పుడు గవర్నర్ ను రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని బిల్లును ఎలా ఆమోదించమంటారని మండిపడ్డారు. గవర్నర్ బిల్లుపై స్టడీ చేయకుండ.. ఆగ మేఘాల మీద స్టాంప్ వేసి పంపాలా? బిల్లుతో ఏదైనా నష్టం వస్తే గవర్నర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తేడా జరిగితే గవర్నర్ పై నెట్టడమే కేసీఆర్ ప్లాన్. గవర్నర్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ పేరు చెప్పి విలీనాన్ని అడ్డుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. కార్మికులకు ఎలాంటి నష్టం కలగకూడదనే గవర్నర్ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

KCR is blocking the merger of RTC in the govt: bandi sanjay

KCR, merger of RTC, bandi sanjay, governor tamilisai, tsrtc, shankarapatnam, kalvala project

Tags:    

Similar News