తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. ఈనెల 26 నుంచి రైతు బంధును రైతుల ఖాతాల్లో వేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. పోడు భూముల పట్టాలు పంపిణీ తర్వాత వారికి కూడా రైతుబంధు డబ్బులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావును, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును ఆదేశించారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.