కాంగ్రెస్‌ను కేసీఆర్ పైకి లేపుతున్నారు : బండి సంజయ్

Update: 2023-06-25 10:27 GMT

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను కేసీఆర్ పైకి లేపుతున్నారన్నారు. బీజేపీ గెలవకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న 30మంది కాంగ్రెస్ అభ్యర్థులకు వేల కోట్లు పాకెట్ మనీ ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో గెలిచిన వాళ్లు ఎలాగో బీఆర్ఎస్ లోని కేసీఆర్ భావిస్తున్నట్లు బండి సంజయ్ చెప్పారు.

కాంగ్రెస్‌ నేతలు అద్దాల మేడలో ఉంటూ సంతోష పడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్‌ అనుకుంటే సరిపోదని, రాష్ట్ర ప్రజలూ అనుకోవాలని బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో జరిగిన హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలనను కేంద్రం గమనిస్తోందని చెప్పారు. 


Tags:    

Similar News