KCR : ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు కేసీఆర్.. వారితో ప్రత్యేక భేటీ
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన తెలంగాణ భవన్కు వెళ్లడం ఇదే తొలిసారి. కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. గులాబీ బాస్ కోసం కార్యకర్తలు భారీగా తరలిచ్చారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణపై ఆ జిల్లాల నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల అనంతరం నల్గొండ జిల్లాలో భారీగా బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభ నుంచే గులాబీ బాస్ లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలుస్తోంది.