KCR at Telangana తెలంగాణ భవన్‌కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

Byline :  Veerendra Prasad
author icon
Update: 2024-03-03 10:46 GMT
KCR at Telangana తెలంగాణ భవన్‌కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
  • whatsapp icon

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఆ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో కరీంనగర్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలకి చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీ అయిన కేసీఆర్.. ఆ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి గట్టి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ‌ల్ల ప‌రిస్థితి కాస్త టఫ్ గా త‌గ్గే ఛాన్స్ ఉంది. ఓటర్లు ఎక్కువగా జాతీయ పార్టీల ప్రభావంతో ఉన్నారు. గులాబీ పార్టీ ఏడెనిమిది సీట్లు గెలిస్తే మళ్లీ గాడిలో పడిపోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సందర్భంగా గులాబీ పార్టీ తరపున ఇప్పటికే కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మెదక్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పేర్లను ప్రకటించనున్నారు. ముందుగా వారి పేర్లను కేసీఆర్ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది.

ఇక ఈ నెల 10న కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో నిర్వహించనున్న సమావేశంపై చర్చిస్తున్నారు కేసీఆర్. రేపు మహబూబ్ బాద్,ఖమ్మం పార్లమెంటు నేతలతో భేటి కానున్నట్లు తెలిసింది. సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, సంతోష్‌కుమార్‌, వినోద్‌కుమార్‌తో పాటు కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య నేతలు హాజరయ్యారు.



 




Tags:    

Similar News