KCR : డేట్ ఫిక్స్.. ఆ రోజు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం

Byline :  Krishna
Update: 2024-01-27 11:08 GMT

సీఎం కేసీఆర్ మళ్లీ పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు. తుంటి ఎముక సర్జరీ తర్వాత చాలా రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఎర్రవల్లి ఫాంహౌస్లో ఉన్న కేసీఆర్ ప్రస్తుత రాజకీయాలపై దృష్టి సారించారు. శుక్రవారం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని.. త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తానని తెలిపారు.

కాగా ఈ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఆయన కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఇప్పటివరకు ప్రమాణం చేయలేదు. సర్జరీ కారణంలో ప్రమాణం వాయిదా పడింది. దీంతో కేసీఆర్ ప్రమాణం చేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్‌ సమక్షంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు.


Tags:    

Similar News