Himanshu : కేసీఆర్ పుట్టినరోజు..మనవడు హిమాన్షు ఎమోషనల్ పోస్ట్

Update: 2024-02-17 11:38 GMT

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు నేడు జన్మదినం. నేడు ఆయన 70వ పుట్టినరోజును జరుపుకుంటుండగా సోషల్ మీడియా వేదికగా పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా ఆయన మనవడు, కేటీఆర్ కొడుకు హిమాన్షు కూడా తాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్‌ షేర్ చేశాడు. తన తాతయ్యకు ప్రేమతో 70వ జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. తనకు అద్భుతమైన జీవితాన్ని అందించినందుకు, ఉన్నత స్థితికి ఎదిగేలా పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.

తనను ఇద్దరు తండ్రులు పెంచారని చెప్పుకోవడానికి ఎల్లప్పుడూ గర్వపడతానని, విశ్వాసం, ఆప్యాయతతో కూడిన తాత మాటలు వింటే ఒత్తిడి, సమస్యలన్నీ దూరం అవుతాయని హిమాన్షు అన్నారు. కష్టకాలంలో ఆత్మవిశ్వాసం, సహనంతో ఉండాలని తన తాత చెప్పిన సూచనలను, మాటలను ఎప్పటికీ మర్చిపోనని, గుర్తుచేసుకుంటూనే ఉంటానన్నారు. అసమానమైన తాతగా, నిజమైన తన దోస్తుగా ఉన్నందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తన కోసం చేసిన ప్రతి పనికీ కేసీఆర్‌కు మనవడు హిమాన్షు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికీ తన తాతను ప్రేమిస్తూనే ఉంటానని చెబుతూ హిమాన్షు చేసిన ఎమోనల్ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ట్విట్టర్ వేదికగా హిమాన్షు చేసిన పోస్టుకు తన తాన కేసీఆర్‌తో దిగిన పాత ఫోటోను ఆయన షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుండగా కేసీఆర్, హిమాన్షు అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:    

Similar News