Khairatabad Ganesh Immersion: ముగిసిన శోభాయాత్ర.. గంగమ్మ ఒడికి గణపయ్య

Byline :  Bharath
Update: 2023-09-28 08:31 GMT

ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ముగిసింది. వేలాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య.. గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ట్యాంక్ బండ్ వద్దున్న క్రేన్ నెంబర్ 4 ద్వారా ఖైరతాబాద్ వినాయకుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ లోని మండపం నుంచి వస్తా వెళ్లొస్తానంటూ ఉదయం 6 గంటలకు బయలెల్లిన గణపతి.. ( Khairatabad Ganesh Immersion)మధ్యాహ్నం 1:30 గంటలకు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు.

దేశంలో ప్రత్యేకమైన ఈ వినాయకుడిని చివరిసారి దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. దీంతో సాగర తీరం సందడిగా మారింది. నగరం నలుమూలల నుంచి గణనాథులు, భక్తులు సాగరతీరానికి భారీగా తరలివస్తున్నారు. జయ, జయ ధ్వానాల మధ్య.. బొజ్జ గణపయ్య యాత్రలు కొనసాగుతున్నాయి. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తులు నినాదాలు చేస్తూ గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నారు. వేడుకల కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. అదనపు బలగాలను రప్పించి భద్రత కల్పిస్తున్నారు.  




Tags:    

Similar News