MLA Rekha Naik : బీఆర్ఎస్కు ఖానాపూర్ ఎమ్మెల్యే రాజీనామా..

Byline :  Krishna
Update: 2023-10-06 10:45 GMT

బీఆర్ఎస్కు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి ఇండిపెండెంట్గా పోటీచేస్తానని ప్రకటించారు. ఖానాపూర్‌లో బీఆర్ఎస్ ఎలా గెలుస్తుందో చూస్తానని అన్నారు. కేటీఆర్ ఫ్రెండ్ కోసం తనకు టికెట్ ఇవ్వలేదని.. తానేంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని హెచ్చరించారు. ‘‘ నేనేం తప్పు చేశా. కుంభకోణాలు చేశానా. అభివృద్ధి పనులకు సైతం నిధులు ఇవ్వలేదు. ఎస్టీ నియోజకవర్గం అని వివక్ష చూపించారు. బీఆర్ఎస్ లో మహిళలకు విలువ లేదు. ఖానాపూర్ గడ్డా.. రేఖానాయక్ అడ్డా’’ అని అన్నారు.

కాగా ఈసారి ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ గులాబీ బాస్ జాన్సన్ నాయక్కు ఇచ్చారు. అప్పటినుంచే రేఖానాయక్ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఆమె కాంగ్రెస్లో చేరుతారని వార్తలొచ్చాయి. అయితే టికెట్పై హస్తం పార్టీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆమె చేరిక ఆగిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని ప్రకటించారు.

ఎస్టీ రిజర్వ్ స్థానమైన ఖానాపూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నేత అజ్మీరా రేఖా నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె.. కాంగ్రెస్ తరఫున ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా విజయం సాధించారు. 2013లో బీఆర్ఎస్లో చేరారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రితేష్ రాథోడ్పై 30వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలిపొందారు.




 Full View



Tags:    

Similar News