తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి!!
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి!!;
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం కేంద్రమంత్రిగా వ్యవరిస్తున్న కిషన్ రెడ్డికి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే బండి సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారని సమాచారం. అటు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కూడా పార్టీలో కీలక పదవిని కట్టబెట్టబోతున్నారని తెలుస్తోంది. వారంలోగా ఈ మార్పులు జరగనున్నాయని బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.