అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా..కిషన్ రెడ్డి

Update: 2023-07-05 10:48 GMT

నేను పార్టీకి విధేయుడిని. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా ముందుకు సాగుతాను, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‎గా బాధ్యతలను అధిష్టానం ప్రకటించిన అనంతరం మొదటిసారిగా కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

" జులై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపడతాను. నేను పార్టీకి విధేయుడిని. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. నాకు పార్టీనే శ్వాస. పార్టీ కోసమే పనిచేస్తా. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం. కేంద్ర మంత్రి పదవికి సంబంధించి కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి స్వీకరిస్తాను .బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వస్తాను. ప్రధాని సభకు ఏర్పాట్లు చేయాలి. మంత్రి పదవి, అధ్యక్ష బాధ్యతులను.. నిర్వహించడం కొంచం కష్టం" అని కిషన్ రెడ్డి కీలక కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉంటే కిషన్ రెడ్డి కేంద్ర కేబినేట్ భేటీకి వెళ్లకుండా ఢిల్లీలోని తన నివాసంలోనే ఉన్నారు. దీంతో కేంద్రమంత్రి పదవికి కిషన్‌రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్‌ నాయకుడు కిషన్‌ రెడ్డికి అధిష్టానం బాధ్యతలను కట్టబెట్టింది . కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని తాజాగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News