6 గ్యారెంటీల అమలుకు.. అప్పులు తీసుకోవాలని చూస్తున్నారు

Byline :  Bharath
Update: 2024-02-06 11:43 GMT

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలతో గారడి చేసిందని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆలోచన లేకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి.. ఆర్థిక వనరులు ఎలా సమకూర్చాలో కాంగ్రెస్ దగ్గర స్పష్టత లేదని ఆరోపించారు. హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రం దగ్గర అప్పులు తీసుకునే ఆలోచనలో ఉందని కిషన్ రెడ్డి అన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డ కిషన్ రెడ్డి.. పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు.

ఇప్పుడు కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ కూడా.. పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకు వాటి గురంచి మాట్లాడలేదని అన్నారు. పొదుపు సంఘాల మహిళలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించే దిశగా బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News