కొడంగల్‌ను అభివృద్ది చేస్తా.. సీఎం రేవంత్‌ రెడ్డి కామెంట్స్

Byline :  Vamshi
Update: 2024-03-28 11:51 GMT

తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పై ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ది చేస్తానని తెలిపారు. ఇక్కడికి సిమెంట్ పరిశ్రమ రాబోతుందని ఇండస్ట్రీ వస్తే భూముల ధరలు పెరుగుతూయున్నారు. కొడంగల్‌లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు.

‘‘ఎన్నికలు వస్తే సెలవులొస్తాయి.. తీర్థయాత్రలకు వెళ్దామని కొందరు అనుకుంటారు. ఓటు చాలా విలువైనది. ఎన్ని కార్యక్రమాలున్నా.. ఓటు వేసేందుకు కొడంగల్‌ వచ్చాను. కార్యకర్తలను కలవాలని వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు నా వెంట ఉన్నారు. ప్రచారానికి రాకున్నా గెలిపించారు. ఇక్కడికి సిమెంట్‌ పరిశ్రమ రాబోతోంది. పరిశ్రమలు వస్తే భూముల ధరలు పెరుగుతాయి. ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది. ఏప్రిల్‌ 6న జరిగే తుక్కుగూడ కాంగ్రెస్‌ బహిరంగ సభకు.. కొడంగల్‌ నుంచి 25 వేల మంది తరలిరావాలి. ఈ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారు. 5 గ్యారంటీలు ప్రకటిస్తారని రేవంత్ తెలిపారు.

Tags:    

Similar News