అవును.. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్పు వచ్చింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Update: 2023-06-24 13:19 GMT

రాష్ట్రంలో బీజేపీ పార్టీలో ఉన్న అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ బీజేపీని వీడి కాంగ్సెస్ కండువా కప్పుకోనున్నారని వార్తులు వినిపిస్తున్నాయి. దాంతో బీజేపీ అధిష్టానం ఈ విషయంపై దృష్టిపెట్టింది. రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ తో సహా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించారు. దీనిలో భాగంగా ఇవాళ (జూన్ 24) వారితో హైకమాండ్ కీలక భేటీ కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు విషయంలో తనపై వస్తున్న వార్తలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం బీజేపీ పార్టీతోనే ఉన్నానని, వార్తల్లో వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇవాళ జరిగే సమావేశంలో పార్టీలో జరుగుతున్న విషయాలపై హైకమాండ్ కు వివరిస్తామని అన్నారు. కేంద్రం కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాజగోపాల్ కోరారు. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మొద్దని వివరించారు. కర్నాటకలో ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చాయని.. అయితే, మోదీ, అమిత్ షా తలుచుకుంటే ఇక్కడ సీన్ రివర్స్ అవుతుందని, బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Tags:    

Similar News