సీఎం రేవంత్పై పాట.. కోమటిరెడ్డి ట్వీట్ వైరల్

Byline :  Bharath
Update: 2023-12-31 11:11 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిలిద్దరు.. భిన్న ధ్రువాల్లా వ్యవహరించడం అందరికీ తెలిసిందే. ఒకరంటే ఒకరికి పడటంలేదనే వార్తలు కూడా మీడియాలో బాగా ప్రచారం జరిగాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్ తీరు పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ నేతలంతా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి.. కలసికట్టుగా కదం తొక్కారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆపై రేవంత్ రెడ్డి సీఎం కాగా.. కీలక నేతలంతా మంత్రులుగా పదవులు దక్కించుకున్నారు.

అధికారం చేపట్టిన తర్వాత కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు స్నేహగీతం ఆలపిస్తున్నారు. రేవంత్ తో తన దోస్తీపై కోమటిరెడ్డి ఓ పాట విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని కవితాత్మకంగా వివరించే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి.

Tags:    

Similar News