డబ్బు వృధా చేసుకోకుండా.. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేయండి

Byline :  Bharath
Update: 2023-12-31 10:12 GMT

కొత్త సంవత్సరం సందర్భంగా తనను కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చేవారు.. శాలువాలు, బొకేలు తేవాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. శాలువాలు, బొకేలకు అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించాలని కోరారు. దీనివల్ల నిరుపేదలకు ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయి లీడర్లంతా.. తనను కలవడమే సంతోషమని అన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి గిఫ్ట్లు తదితర ఆర్భాటాలకు వెళ్లాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ చుట్టూ తిరగాల్సిన పనిలేదని, తామె ప్రజల వద్దకు వచ్చి పాలిస్తామని చెప్పారు.

ప్రాజెక్టుల పేరిట బీఆర్ఎస్ దోచుకున్న ప్రభుత్వం ఖజానాను లూటీ చేసిందని ఆరోపించారు. న్యూఇయర్ కానుకలని డబ్బు వృధా చేయకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తే.. ఆ డబ్బు నిరుపేదలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. అంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఆదివారం తనను కలవడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడిన కోమటిరెడ్డి.. వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

Tags:    

Similar News