నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు కవితకు లేదు - Konda Surekha

Byline :  Kiran
Update: 2024-02-03 10:44 GMT

ఇంద్రవెల్లి సభ కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న కవిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. ఆమె తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు కవితకు లేదని స్పష్టం చేశారు. భద్రాద్రి సీతారాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాలో ఏ డబ్బుతో కొన్న పట్టు పస్త్రాలు తీసుకెళ్లాడని కొండా సురేఖ ప్రశ్నించారు.

పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు ప్రజల సొమ్ము దోచుకుతిన్నారని కొండా సురేఖ మండిపడ్డారు. లిక్కర్ కేసులో ఇరుక్కొని బీజేపీ కాళ్లు పట్టుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. కవిత ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రజలు ఓడగొట్టి ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. తాము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటామే తప్ప బీఆర్ఎస్ నేతలకుకాదని స్పష్టం చేశారు. కవిత ఇప్పటికైనా చిల్లర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఇప్పుడు పూలే గురించి మాట్లాడుతున్న కవితకు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా అని కొండా సురేఖ ప్రశ్నించారు.

Tags:    

Similar News