రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ స్కూటీ నడుపుతూ అదుపుతప్పి కిందపడిపోయారు.
స్కూటీపై నుంచి పడిపోయిన కొండా సురేఖకు గాయాలయ్యాయి. తల, చేయితో పాటు కాలికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడ సురేఖకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది.