నాపై పోటీ చేసి గెలువు.. రేవంత్ రెడ్డికి కొడంగల్ ఎమ్మెల్యే సవాల్..
సీఎం కేసీఆర్ దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్లపై ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ ముందు తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తనపై గెలిచిన తర్వాత.. కేసీఆర్‌పై పోటీ చేయాలని సూచించారు. కొండగల్‌లో మీడియాతో మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి.. సొంత కర్యకర్తలకు న్యాయం చేయని రేవంత్.. ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు.
కేటీఆర్ దత్తత తీసుకున్నాక కొడంగల్ అభివృద్ధి జరిగిందని నరేందర్ రెడ్డి చెప్పారు. కోస్గి, మద్దూర్లో రోడ్ల వెడల్పు పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. మున్సిపాలిటీలను డెవలప్ చేయడంతో పాటు జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. గ్రామాల్లో రోడ్లు బాగుచేయడంతో పాటు అందరికీ సంక్షేమ పథకాలను అందుతున్నాయనని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి అయిన తనను కొడంగల్ ప్రజలు ఈసారి 20 నుంచి 30 వేల మెజారిటీతో గెలిపిస్తారని నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.