మరో 15 నుంచి 20 ఏళ్లలో సింగరేణి కాలరీస్ మూతపడే దుస్థితి ఉందని సీపీఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి ఎలక్షన్స్ తో రాజకీయ పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేశారాయన. ఈ విషయంలో కాంగ్రెస్, సీపీఐకి మధ్య తగువులు లేవని చెప్పుకొచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని చెప్పారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా ఉన్నందునే.. తాను ఈ విషయం గురించి మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
సింగరేణి ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న AITUC, TNTUCలకు.. కమ్యూనిస్ట్ పార్టీకి, కాంగ్రెస్కు అనుబంధం ఉందని కూనంనేని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, చంద్రబాబు టీడీపీ హయాంలో కూడా.. AITUC, TNTUCలు వేరు వేరుగానే పోటీ చేశాయని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సింగరేణి కాలరీస్ ఉన్న స్థానాల్లో ఎక్కువగా కాంగ్రెస్ కు మంచి మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు.