బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాపై అమెరికాలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తనను మళ్లీ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేట్ చేసినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతూనే.. టికెట్లు దక్కనివారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రజా జీవితంలో నిరాశ, నిస్పృహాలు ఎదురవుతాయి. సామర్థ్యం కలిగిన కొంత మంది నాయకులకు దురదృష్టవశాత్తూ టికెట్లు లభించలేదు. ఉదాహరణకు క్రిశాంక్‌తో పాటు అలాంటి కొంత మంది నాయకులకు అవకాశం రాలేదు. వీరందరికి ప్రజలకు సేవ చేసేందుకు మరొక రూపంలో అవకాశం ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు.
సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరం
Anna,
— Krishank (@Krishank_BRS) August 21, 2023
You have introduced me to this big family of @BRSparty which gave me immense love across State. If not for you my political journey would have ended in 2018-19. You have held my hand all the way & that means a lot for my wife Suhasini & me.
Forever with you @KTRBRS anna ! https://t.co/jPVm0fvgcb
హేమాహేమీలకు టికెట్లు దక్కకపోయినా పట్టించుకోని కేటీఆర్.. మన్నే క్రిశాంక్ గురించి ట్విటర్‌లో ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అర్హుడు, ఎంతో సమర్థత కలిగిన క్రిశాంక్‌కు స్థానం దక్కకపోవటం దురదృష్టకరమని సాక్షాత్తూ కేటీఆర్ అభిప్రాయపడడం.. క్రిశాంక్ కు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో తెలుస్తోంది. ‘‘ చాలా సామర్థ్యం, అర్హత ఉన్న మన్నే క్రిశాంక్ (కంటోన్మెంట్ టికెట్ ఆశించిన వ్యక్తి) లాంటి కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరం. పోటీ అవకాశం ఉన్నా తిరస్కరణకు గురైన క్రిశాంక్‌తో పాటు మిగతావారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసుకునే భరోసా పార్టీ లభిస్తుంది. ’’ అని ట్వీట్ చేశారు కేటీఆర్.
ఎప్పటికీ మీతోనే కేటీఆర్ అన్నా
నేనెప్పుడూ, ఎప్పటికీ సార్, రామన్న వెంటే ...
— Krishank (@Krishank_BRS) August 21, 2023
కెసిఆర్ గారి మూడవ సారి ప్రభుత్వం ఏర్పాటుకు నా చిన్న వంతుగా పనిచేస్తా ! pic.twitter.com/7r2yOLBTbP
తనకు టికెట్ దక్కకపోవడంపై మంత్రి కేటీఆర్ స్వయంగా స్పందించడం పట్ల మన్నే క్రిశాంక్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ అన్నా.. బీఆర్ఎస్ పార్టీ అనే పెద్ద కుటుంబంలో నాకు సభ్యుడిగా అవకాశం ఇచ్చింది మీరే. ఈ కుటుంబం రాష్ట్రవ్యాప్తంగా నాకు అమితమైన ప్రేమనిచ్చింది. మీరు లేకుంటే నా రాజకీయ జీవితం 2018-19లోనే ముగిసిపోయి ఉండేది. సాధ్యమైనప్పుడల్లా మీరు నా చెయ్యి పట్టుకుని నడిపించారు. నాకు, మా ఆవిడ సుహాసినికి అదే చాలు. ఎప్పటికీ మీతోనే కేటీఆర్ అన్నా !!’’ అని క్రిశాంక్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి క్రిశాంక్ బీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. అయితే ఆ స్థానం నుంచి దివంగత సాయన్న కుమార్తె లాస్య నందితకు టికెట్ కేటాయించడం గమనార్హం.
Brs Party Social Media Convener Krishank Emotional Post On His Political Career
Bharat Rashtra Samithi, BRS, 119 Assembly constituencies, Chief Minister K Chandrashekar Rao, BRSparty, assembly elections , Party President Sri KCR Garu , candidate from Siricilla capable leader Krishank_BRS, serve the people, Not Getting Ticket,