KRMB కి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించం.. తెలంగాణ ప్రభుత్వం

Byline :  Veerendra Prasad
Update: 2024-02-12 05:25 GMT

మూడోరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నోట్‌ను రిలీజ్ చేసింది. కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు, కేసీఆర్ తప్పిదాలు.. లోప భూయిష్ట విధానాలు పేరుతో ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. కృష్ణా బేసిన్ లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని నోట్‌లో కాంగ్రెస్ పేర్కొంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నోట్‌లో వెల్లడించింది. కేసీఆర్ పాపాలు.. తెలంగాణకు శాపంగా మారాయని.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తి లేదని తెలిపింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యింది. అలాగే అసెంబ్లీలో సాగు నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్‌కు కీలక విజ్ఞప్తి చేసింది.ప్రభుత్వంతో పాటు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు తమకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు.

ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి బీఆర్ఎస్ సభ్యులు వినతి పత్రం ఇచ్చారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. అసెంబ్లీలో పపర్ పాయింట్ ప్రజంటేషన్‌కు నిరాకరించారు. మరోవైపు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించమని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే దానికి తాము మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది 



 




Tags:    

Similar News