కేసీఆర్, కేటీఆర్ను చెట్టుకు ఉరేసి చంపినా తప్పులేదు: రేవంత్ రెడ్డి

Update: 2023-06-14 14:31 GMT

ధరణి పోర్టల్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు వ్యఖ్యలు చేశారు. ధరణి దాని వెనుక ఉన్న దోపిడీ, దోపిడీ వెనుకున్న దొరలు, రాజులకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు ప్రజలకు ఏ విధంగా వివరించాలో కూడా తనకు అర్థం కావట్లేదని అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్విహించిన ఆయన.. 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఇంత దోపిడీ ఏ ప్రజాప్రతినిధి చేయలేదని వాపోయారు. రైతులంతా సీఎం కేసీఆర్, కేటీఆర్ ను శాసనసభా ప్రాంగణంలో చెట్టుకు కట్టేసి ఉరితీసినా.. రాళ్లతో కొట్టి చంపినా తప్పు లేదని ఘాటుగా విమర్శించారు.

తెలంగాణ ప్రజలకు ధరణి జీవన్మరన సమస్యగా మారిందని రేవంత్ మండిపడ్డారు. భూముల వివరాలున్న ధరణి పోర్టల్ ను.. ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారని ఆరోపించారు. ఐఎల్ఎఫ్ఎస్ (ILFS) సంస్థలో ఫిలిప్పీన్ కు చెందిన కంపెనీల పెట్టుబడులు పెట్టారన్నారు. అంతర్జాతీయ బ్యాంకులను ఈ సంస్థ నిండాముంచని తెలిపారు. ధరణి పోర్టల్ తో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ సైబర్ నేరగాళ్లని, ధరణి పోర్టల్ ద్వారా 22 నెలల్లో దాదాపు 50 వేల కోట్ల లావాదేవీలు జరిపాయని విమర్శించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ధరణిపై సీఐజీ నివేదికను అడగాలని డిమాండ్ చేశారు.


Tags:    

Similar News