కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. నిన్న నల్గొండ సభ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో లాస్యకు కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హోంగార్డు మృతి చెందగా, ఎమ్మెల్యేకు స్వల్ప గాయ్యాయి. ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి నందిత నివాసానికి వెళ్లి పరామర్శించారు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో అద్దంకి - నార్కట్‌పల్లి రహదారిపై ట్రాఫిక్‌ను పోలీస్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారును మరో కారు ఢీకొంది. పోలీస్ సిబ్బంది పైకి లాస్య నందిత కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో నార్కట్‌పల్లి పీఎస్‌లో పనిచేస్తున్న హోంగార్డు కిషోర్ మృతి చెందారు.
మరో హోంగార్డుకు గాయాలు అయ్యాయి. హోంగార్డును ఆస్పత్రికి తరలించారు సంగతి విదితమే.మరోవైపు ప్రమాదంలో చనిపోయిన కిషోర్ నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాద సమయంలో ఎమ్మెల్యేతో పాటుగా ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్‌మెన్లు కారులో ఉన్నారు. మరోవైపు లాస్యనందిత కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తాను క్షేమంగా ఉన్నానంటూ లాస్యనందిత ఎక్స్‌లో ట్వీట్ చేశారు. స్వల్ప గాయాలతో బయటపడ్డానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత ప్రథమ చికిత్స తీసుకుని హైదరాబాద్ బయల్దేరినట్లు ట్వీట్ చేశారు.