మైనార్టీ డిక్లరేషన్పై మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదు - షబ్బీర్ అలీ

By :  Kiran
Update: 2023-11-11 08:15 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు ఆయనకు లేదని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు మైనార్టీలు, బీసీల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని విమర్శించారు. మైనార్టీ డిక్లరేషన్‌పై ఆయన కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు ఇస్తామని హామీ ఇచ్చిన 12శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ మాట్లాడితే బాగుంటుందని షబ్బీర్ అలీ సటైర్ వేశారు. ఇన్నాళ్లు కేటీఆర్ పై కొంత గౌరవం ఉండేదని, ఇప్పుడు అది కూడా పోయిందని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటేనన్న ఆయన.. లిక్కర్ స్కాంలో ఆ రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు.ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్ కలిసిపోయారడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని షబ్బీర్ అలీ అన్నారు.


Tags:    

Similar News