గద్దర్ మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశంల్లో మాట్లాడిన ఆయన గద్దర్ గురించి ప్రస్తావించారు. గద్దర్.. తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. కవిగా, గాయకుడిగా తన ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారని, ప్రజలను చైతన్య పరిచారని అన్నారు. ఈ సందర్భంగా గద్దర్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.