KTR : ఫార్ములా ఈ-రేస్‌ రద్దు.. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కల్గించే నిర్ణయం

Byline :  Bharath
Update: 2024-01-06 06:56 GMT

హైదారాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దైన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం నుంచి లీగ్ నిర్వాహణకు స్పందన రాకపోవడంతో రేస్ ను రద్దు చేస్తున్నట్లు ఎఫ్ఐఏ తెలిపింది. కాగా ఈవెంట్ రద్దుపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన నిర్ణయం అని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని.. ఈ ప్రిక్స్‌ లాంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా మన అస్తిత్వాన్ని పెంచుతాయని అన్నారు.

ఇలాంటి ఈవెంట్లు నిర్వహించకపోవడం తిరోగమన స్థితికి వెళ్లడమేనని కేటీఆర్ దుయ్యబట్టారు. గతంలో పెట్టుబడుల కోసం ఫార్ములా ఈ రేస్‌ను ఉపయోగించుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో.. హైదరాబాద్ వేదికగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా ఈ రేస్ చక్కటి అవకాశం దక్కిందని అన్నారు. సస్టయినబుల్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా తెలంగాణను ప్రమోట్ చేసేందుకు.. తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చారు.


 




Tags:    

Similar News