దురదృష్టవశాత్తు అర్హులైన కొందరికి టికెట్ దక్కలేదు: కేటీఆర్

Update: 2023-08-21 13:20 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సోమవారం (ఆగస్టు 21) తెలంగాణ భవన్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేట్ అయిన అభ్యర్థులందరికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు. తనను సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీ అధ్యక్షులు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రజాజీవితంలో నిరాశా నిస్పృహలు అందరికీ ఎదురవుతుంటాయి. దురదృష్టవశాత్తూ కొందరు అర్హులైన, సమర్థులైన క్రిశాంక్ లాంటి వాళ్లకు అవకాశం దక్కలేదు. ప్రజలకు సేవ చేసేందుకు వాళ్లకు మరొక రూపంలో అవకాశం తప్పక కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా పార్టీలో అసంతృప్త నేతలపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘హనుమంత రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే కాకుండా.. హరీశ్ రావుకు పూర్తి మద్దతునిస్తున్నా. హనుమంతరావు బీఆర్ఎస్ పుట్టుక నుంచి సభ్యుడిగా ఉన్నారు. బీఆర్ఎస్కు హరీశ్ ఒక మూలస్తంభం లాంటివారు. అలాంటి వారిపై వాళ్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నార’ని ఇన్ డైరెక్ట్గా కేటీఆర్ ట్వీట్ చేశారు.







Tags:    

Similar News