నిజాం కాలేజీలో చదువుకోవడం ఆనందంగా ఉంది - కేటీఆర్

Update: 2023-08-12 07:39 GMT

నిజాం కాలేజీలో అనేక జ్ఞాపకాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నిజాం కళాశాలలో క్లాస్ రూం కాంప్లెక్స్, బాయ్స్ హాస్టల్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్... తాను కూడా నిజాం కాలేజీలోనే చదువుకున్నానని, తెలంగాణ వచ్చాక కళాశాల అభివృద్ధికి అనేక రకాల నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రూ.144 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు హెచ్‌ఎండీఏ నుంచి ₹40.75 లక్షలు కేటాయించామని మంత్రి కేటీఆర్ అన్నారు.

నిజాం కాలేజీలో 1993- 96 మధ్య చదువుకున్నానని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. స్టేట్ యూనివర్సిటీల్లో నిజాం కాలేజీకి 4వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉందన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం నిజాం కాలేజీలో చదివినా కళాశాల అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వలేనది కేటీఆర్ విమర్శించారు. ఏడాదిలో భవన నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కాలేజ్ గ్రౌండ్ కు ఇబ్బందులు రాకుండా నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు.

Tags:    

Similar News