తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం అందింది. 2024 ఫిబ్రవరిలో బోస్టన్ వేదికగా జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని.. కేటీఆన్ కు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఇండియా రైసింగ్- బిజినెస్, ఎకానమీ, కల్చర్ థీమ్‌తో ఇండియా కాన్ఫరెన్స్ 21వ ఎడిషన్ ను నిర్వహించనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలోని విద్యార్థులు నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు మన దేశానికి చెందిన వెయ్యి మంది నిపుణులు, బిజినెస్ లీడర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొంటారు.
గతంలో అమర్త్యసేన్, అజీం ప్రేమ్ జీ, అనామికా ఖన్నాలతో పాటు.. పలువురు మంత్రులు, బిజినెస్ లీడర్స్, విద్యావేత్తలు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానంలో తెలిపింది. తెలంగాణ అభివృద్ధి విధానాలను వివరించేందుకు ఇదొక మంచి అవకాశమని కేటీఆర్ తెలిపారు. కాగా హార్వర్డ్ ఆహ్వానం కేటీఆర్ కి ఇదే మొదటిదేం కాదు. గతంలో కూడా ఆయనకు ఈ యూనివర్శిటీ నుంచి కాన్ఫరెన్సుల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందాయి.