'100 అబద్ధాల బీజేపి'.. సీడీ విడుదల చేసిన మంత్రి కేటీఆర్
వంద అబద్ధాలు చెప్పి తెలంగాణకు, దేశానికి హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో బీజేపీ వంద అబద్ధాలపై బీఆర్‌ఎస్ సంకలనం చేసిన సీడీని సోమవారం ప్రగతి భవన్‌లో విడుదల చేశారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్.. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు క్రిశాంక్, జగన్ మోహన్ రావు, దినేష్ చౌదరిలు పాల్గొన్నారు. BRS సోషల్ మీడియా గత 4 నెలలుగా #100AbadhaalaBJP అనే ప్రచారాన్ని నిర్వహించింది, ప్రతిరోజూ వారి అబద్ధాలతో బిజెపిని బట్టబయలు చేసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ల కృషిని అభినందించారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పలు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే విమర్శలకు పదునుపెట్టాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏదో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. సంక్షేమ పథకాలు, ఉద్యోగాల నోటిఫికేషన్ .. అంటూ అధికార బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీలు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.