KTR ON Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లేట్ తిప్పేసి.. పక్కా బీజేపీలో చేరతాడు

Byline :  Bharath
Update: 2023-10-05 14:50 GMT

రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ తర్వాత.. నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోని 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చుతారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్లేట్ తిప్పేసి ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరతారని అన్నారు. అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం చేయని కాంగ్రెస్.. ఇప్పుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తుందని విమర్శించారు. ‘మేం ఎవరికి బీ టీం కాదు. ప్రజలే మా టీం’ అని చెప్పుకొచ్చారు.




 


‘బీజేపీ పార్టీ నేతలు వచ్చి బీఆర్ఎస్.. కాంగ్రెస్ బీ-టీం అంటారు. కాంగ్రెస్ నేతలు వచ్చి బీఆర్ఎస్.. బీజేపీ బీ టీం అంటారు. వేరేవాళ్లకు బీ టీంగా ఉండే కర్మ మాకేం పట్టలేదు’ అని కేటీఆర్ అన్నారు. ప్రజల దయ ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల టీంగానే ఉంటామే తప్ప మరొకరికి ఉండమని తేల్చి చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓట్లు అడగటానికి వస్తే దబాయించి పైసలు అడగండని చెప్పారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వస్తేనే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండని ప్రజలను కోరారు. ‘కాంగ్రెస్ వాళ్లు కడుపులో గుద్ది నోట్లో పిప్పరమెంట్ పెడతారు. బీజేపీ వాళ్లు నీళ్ల వాటా తేల్చరు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని కాంగ్రెస్ లీడర్లే చెప్పారు. రేవంత్ ఓ గాడ్సే’ అని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.




Tags:    

Similar News