KTR : కేటీఆర్ అడిగిన ఉగ్గాని గురించి మీకు తెలుసా..?

Byline :  Krishna
Update: 2023-10-06 16:46 GMT

ఉగ్గాని.. తెలంగాణవాసులకు ఇది పెద్దగా తెలియదు. తెలంగాణ పాఠశాలల్లో సీఎం అల్పాహారం పథకం ప్రారంభం సందర్భంగా కేటీఆర్ ఉగ్గాని అంటే ఏంటని అడగడంతో ఇది చర్చలోకి వచ్చింది. ఆ సభలో టిఫిన్ లిస్ట్ చదివిన కేటీఆర్ ఉగ్గాని అంటే ఏంటీ..? అని అడిగారు. ఈ ఉగ్గానిపై తనకు ఐడియా లేదని.. తమ ఇంట్లో ఎప్పుడూ వండలేదని చెప్పారు. దీంతో అంతా ఉగ్గాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఉగ్గాని రాయలసీమ వాసుల ఫెవరెట్ ఫుడ్. సీమ సందులలో ఎక్కడైనా దొరికే అల్పాహారం ఉగ్గాని. హైదరాబాద్ బిర్యానీ..కాకినాడ కాజా.. అమలపురం పుతరేకులు..ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో వంటకం స్పెషల్. అలా రాయలసీమ ప్రాంతంలో ఉగ్గాని చాలా ఫేమస్. ఈ ప్రాంతంలో ఉగ్గానికి ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు. అసలు ఉగ్గాని అంటే ఏంటీ ? అసలు తెలంగాణలో ఈ వంటకం చేస్తారా..? అనేది తెలుసుకుందాం.

ఉగ్గాని కర్నాటకలో ప్రజల ఎక్కువగా తినే టిఫిన్. కర్నాటక నుంచి ఇది రాయలసీమకు వచ్చింది. సీమ వాసులు దీనిని ఇష్టంగా తినడంతో అక్కడ ఇది ఫేమస్గా మారింది. చాలా ప్రాంతాల్లో అటుకులు, మరమరాలతో పులిహోర టైప్లో చేస్తారు. దీనిని ముంత మసాలా అంటారు. ఈ ముంత మసాలానే రాయలసీమలో వెరైటీగా చేస్తారు. దాన్ని టేస్ట్ సూపర్బ్ గా ఉండడంతో ఉగ్గానికి అక్కడ ఫుల్ గిరాకీ ఉంటుంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉగ్గానిని ఎక్కువగా తింటారు.

తయారీ విధానం

మొదట మరమరాలను ఒక గిన్నెలో తీసుకొని నీళ్లు పోసి నానబెట్టాలి. ఐదు నిమిషాలు అయిన తరువాత వాటిని గట్టిగా నీళ్లు లేకుండా పిండి కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. పుట్నాల పప్పు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి పొడి కలిపి మిక్సిలో మెత్తగా పొడి చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకును కచ్చాపచ్చాగా రోటిలో దంచుకోవాలి.ఆ తర్వాత ఓ గిన్నెలో నూనె వేసి జీలకర్ర, సాయిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. అవి వేగిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగిన తరువాత టమాటా ముక్కలు వేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముద్ద, పసుపు, కారం వేయాలి. కొద్దిసేపటి తర్వాత నానబెట్టిన మరమరాలు, పుట్నాలపొడి వేసి కలపాలి. మరమరాలు ఉడికిన తరువాత చివరకు కొత్తిమీర వేసుకోవాలి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని మిర్చీబజ్జీతో తింటా అదిరిపోతుందని చెప్తుంటారు.


Tags:    

Similar News