కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్తేమీ కాదు కేటీఆర్ కామెంట్స్
బీఆర్ఎస్ సర్కారు హయాంలో పూర్తయిన స్టాఫ్ నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకోవడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఫైరయ్యారు. వేరే వాళ్ల క్రెడిట్‌ను కొట్టేయడం ఇదే తొలిసారి కాదని.. అలాగే చివరి సారి కూడా కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని క్రెడిట్ చోర్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. 15,750 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ హయాంలోనే రిక్రూట్మెంట్ జరిగిందని చెబుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా 5 అక్టోబర్ 2023 రోజున ఇచ్చిన న్యూస్‌ను ట్వీట్‌కు జతపరిచారు. అంతేకాదు, 7 అగస్ట్ 2023 రోజున నర్సుల రిక్రూట్మెంట్‌కు సంబంధించిన జీవోను కూడా జత చేశారు. క్రెడిట్ చోరీ కాంగ్రెస్ పార్టీకి ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు..6,956 స్టాఫ్ నర్సులు, 15,750 పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌ను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ కారణంగా రిజల్ట్స్ రిలీజ్ చేయలేకపోయామని తెలిపారు. ఇప్పుడు రిక్రూట్‌మెంట్‌తో సంబంధం లేని కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తామే చేశామని ప్రజలను మోసం చేయాలనుకుంటోందని విమర్శించారు.కొత్త ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు.