కోదండరాంకు ఉన్న అర్హతలేంటో చెప్పాలి - కుర్ర సత్యనారాయణ

Byline :  Kiran
Update: 2024-02-01 11:28 GMT

తాను గవర్నర్ బాధితున్ని అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏండ్ల ప్రజా జీవితంలో తనపై ఎలాంటి మచ్చలేదని అన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిందని చెప్పారు. ఎరుకల కులంలో పుట్టినా జనరల్ సీటులో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత తన సొంతమని అన్నారు. గత ప్రభుత్వాలు ఎరుకల గురించి ఆలోచించలేదని, తన సేవలను గుర్తించిన కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారని సత్యనారాయణ గుర్తుచేశారు. అయితే రాజ్యాంగ పరిరక్షకురాలిగా ఉండాల్సిన గవర్నర్ అందుకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆయన ఆరోపిస్తున్నారు. తన అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళిసై తిరస్కరించిన తీరు బాధ కలిగించిందన్న వాపోతున్నారు. కోదండరాంకు ఉన్న అర్హతలేంటో.. తనకులేనిదేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పేదోళ్లకు అవకాశం రావద్దా అని ప్రశ్నిస్తున్న కుర్ర సత్యనారాయణతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్.

Tags:    

Similar News