గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధం అవుతున్న మర్రి ప్రవళిక (23).. హైదరాబాద్ అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడం వల్ల మనస్తాపానికి చెందిన ప్రవళిక.. హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవాన్మరనానికి పాల్పడింది. కాగా ప్రవళిక స్వగ్రామ్ జిక్కాజిపల్లిలో అమె అంత్యక్రియలు ముగిశాయి. ప్రవళికను చివరిసారిగా చూసేందుకు ఊరంతా కదలివచ్చింది. ఉద్రిక్త వాతావరణం మధ్య ప్రవళిక అంతిమ యాత్ర ముగిసింది. బొక్కాజిపల్లికి చేరుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రవళిక మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కేయూ, ఓయూ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొంది.