తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. 15 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు‌కు శ్రీకారం

Byline :  Vamshi
Update: 2024-02-24 07:23 GMT

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో రూ.230 కోట్లతో 15 అమృత్ భారత్ స్టేషన్లను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు రూ.169 కోట్లతో 17 రైల్వే ఫ్లెఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించనున్నట్లు జీఎం తెలిపారు.ఈ మేరుకు ఈ నెల 26న పలు రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఉంటుందని ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేస్తారని జీఎం జైన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రధానిమోడీ 500కు పైగా అమృత్ భారత్ స్టేషన్లకు భూమిపూజ, ప్రారంభోత్సవం చేయనున్నట్లు స్పష్టం చేశారు. 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లకు భూమి పూజ ప్రారంభోత్సం ఉంటుందన్నారు. 32 రైల్వే ఫైఓవర్లు, అండర్ పాస్ లను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.621 కోట్లు ఉంటుందన్నారు. రాష్ట్రంలో 40 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి ఖర్చు రూ.2,245 కోట్లు ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ 21 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి భూమిపూజ చేశారు. 2014 లో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి రైల్వేలలో దేశం ఘననీయమైన పురోగతి సాధిస్తూ వస్తోంది. కొత్త రైల్వేలైన్లతో పాటు, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలలో డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది. అంతేకాకుండా, రైల్వేలలో 100 శాతం విద్యుద్దీకరన సాధన లక్ష్యంగా పని చేస్తున్న భారతీయ రైల్వే ఆ దిశగా చేపట్టిన పనులు పెద్దఎత్తున పురోగతి సాధించాయి. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదలు తెలిపి, హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News